రచయిత

ప్రదీప్ — insurancetalks.in

నమస్కారం, నేను ప్రదీప్. నేను బి.ఏ. చదువుకున్నాను. నా వృత్తి బ్లాగింగ్ — వెబ్‌సైట్ల కోసం సమాచారం రాయడం.

ఇన్సూరెన్స్ గురించి ఎందుకు రాస్తున్నాను?

మన చుట్టూ ఇన్సూరెన్స్ గురించి బాగా అర్థం చేసుకుని పాలసీ తీసుకునేవాళ్ళు చాలా తక్కువ. ఎక్కువమందికి ఇన్సూరెన్స్ గురించి మొదట తెలిసేది అమ్మేవాళ్ళ ద్వారానే, దాంతో నమ్మకం కంటే అనుమానమే మిగులుతుంది. పోనీ మనమే తెలుసుకుందాం అంటే, మార్కెట్‌లో వందల కొద్దీ పాలసీలు, ఎప్పటికప్పుడు మారే నియమాలు, అర్థం కాని పదాలు — ఇదంతా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నట్టే ఉంటుంది. ఈ ఇబ్బంది నాకూ అనిపించింది, మరి చాలామందికీ ఇలాగే అనిపిస్తుందని తెలుసు. అందుకే ఈ సైట్ మొదలుపెట్టాను — నేను కష్టపడి చదివి, అర్థం చేసుకున్న విషయాన్ని మన తెలుగులో సులభంగా చెప్పడానికి.

వాస్తవాలు ఎలా చెక్ చేస్తాను?

ప్రతి ఆర్టికల్‌లో ఉన్న సమాచారం IRDAI (irdai.gov.in, policyholder.gov.in), ప్రభుత్వ పథకాల అధికారిక వెబ్‌సైట్లు (ఉ.దా: pmjay.gov.in, jansuraksha.gov.in) లేదా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అధికారిక బ్రోషర్/పాలసీ డాక్యుమెంట్ నుండి తీసుకున్నదే. అగ్రిగేటర్ / సేల్స్ సైట్లను (Policybazaar లాంటివి) సమాచార మూలంగా వాడను. ఏ విషయం అధికారికంగా నిర్ధారణ కాకపోతే, దాన్ని ప్రచురించను. ప్రతి ఆర్టికల్ ప్రచురణకు ముందు నేను చదివి ఆమోదిస్తాను.

ఈ సైట్‌లో ఏ పాలసీనీ అమ్మను, సిఫార్సు చేయను, ఏ కంపెనీ నుంచీ డబ్బు తీసుకోను. పూర్తి వివరాలు మా ఆదాయం మరియు మేము ఎలా రాస్తాం పేజీల్లో చూడండి.